బయ్యక్కపేటలో ఘనంగా సమ్మక్క తల్లి వేడుకలు

బయ్యక్కపేటలో ఘనంగా సమ్మక్క తల్లి వేడుకలు

బయ్యక్కపేటలో ఘనంగా సమ్మక్క తల్లి వేడుకలు

– ప్రత్యేక పూజలు చేసిన చందా వంశీయులు

తాడ్వాయి, తెలంగాణ జ్యోతి : సమ్మక్క తల్లి పుట్టినిల్లైన ములుగు జిల్లా తాడ్వాయి మండలం బయ్యక్కపేటలో గురువారం అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చందా వంశీయులు ప్రత్యేక పూజలు నిర్వహించి గద్దెపై సమ్మక్క తల్లిని ప్రతిష్టించారు. చందా వంశీ యుల ఆడపడుచు సమ్మక్క దేవతను తమ ఇంటి ఇలవేల్పుగా కొలుస్తారు. ఈ నేపథ్యంలో చంద వంశీయుల ఆధ్వర్యంలో జరిగిన ఈ జాతరకు పరిసర గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. చంద వంశీయులైన రఘుపతిరావు, గోపాలరావు, పరమయ్య, కళ్యాణ్ కుమార్, కృష్ణమూర్తి, స్వామి, తలపతుల స్థానంలో వడ్డెలు సిద్ధబోయిన చలమయ్య, కృష్ణారావు, ఆలయం సమ్మయ్య దేవతను పూని జాతర ఘట్టాన్ని నిర్వహించారు. ఉదయమే తలపతులు, వడ్డెలు గంగ స్నానాలు చేసి సమ్మక్క పూజా మందిరం శుద్ధిచేశారు. డోలు వాయిద్యాలు, శివసత్తుల పూణకాల మధ్య వనంను గద్దెకు చేర్చారు. అనంతరం అదేరాలను తీసుకువచ్చారు. సాయంత్రం 8 గంటలకు దేవత గుట్ట నుంచి సమ్మక్క తల్లిని కుంకుమ భరణి రూపంలో డోలు వాయిద్యాల నడుమ అంగరంగ వైభవం గా గద్దెకు చేర్చారు. కాగా, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క బయ్యక్కపేటలో సమ్మక్క తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.