రాజుపేటలో  ఘనంగా మేడే వేడుకలు 

Written by telangana jyothi

Published on:

రాజుపేటలో  ఘనంగా మేడే వేడుకలు 

తెలంగాణ జ్యోతి, మంగపేట : మండలంలోని రాజుపేటలో శ్రీ హనుమాన్ భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు పిండిగ నాగరాజు ఆధ్వర్యంలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. మేడే కార్మికుల దినోత్సవం సందర్బంగా కార్మికులు హనుమాన్ గుడి దగ్గర నుంచి రమణక్క పేట కిలో మీటర్ వరకు బైక్ ర్యాలీ చేసి నినాదాలు చేశారు.అనంతరం మే డే వేడుకలకు ముఖ్య అతిధిగా వచ్చిన ఉపాధ్యాయ సంఘల నాయకులు గొప్ప సమ్మరావు గిరిజన పెట్రోల్ పంపు దగ్గర ఉన్న ఖాళీ స్థలంలో జెండాను ఎగుర వేసి వివిధ రంగాలలో పని చేసే కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు అనేక మంది తమ ప్రాణాలను తృణ ప్రయంగా అర్పించి శ్రమ దోపిడీ పై విజయం సాదించి 1886 మే 1 నుంచి 8 గంటల పని విధానం అమల్లోకి వచ్చిన రోజన అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఎస్కె హుసేన్, ఉపాధ్యక్షులు లంగరి శ్రీను, కోశాధికారి గొల్ల శివ, చాగాల బాలు మేస్త్రి,సోషల్ మీడియా పెండకట్ల రవి, చీరల రమేష్, ఎస్కె సలీమ్, సోమా రాజు, చంటి,కృష్ణ, చెంచయ్య, సంతోష్, సతీష్, ప్రశాంత్, శ్రీ రాములు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment