మహాదేవపూర్లో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు

మహాదేవపూర్లో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు

మహాదేవపూర్ మార్చి 29, తెలంగాణ జ్యోతి : జయశంకర్ భూపాల పల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని మహాదేవపూర్ లో పాస్టర్ చేకూర్తి చెందు, బేథెస్తా గ్యాస్ఫూల్ పాస్టర్ మోజెస్, న్యూ బేథెస్తా కుమ్మరి రాజయ్య, యేసు ప్రేమించుచున్నాడు ప్రార్థనా మందిరంలో రాపల్లి కోట, బెగ్లూర్ పాస్టర్ జోసెఫ్, పాస్టర్ ప్రకాష్,పాస్టర్ సురేష్ ల ఆధ్వర్యంలో వారి వారి ప్రార్ధన మందిరం లో యవ్వనస్తుల మధ్య గుడ్ ఫ్రైడే వేడుకలను ఘనంగా నిర్వహించుకొన్నట్లు వారు తెలిపారు. ఏసుక్రీస్తు సిలువలో పలికి న అతి ప్రాముఖ్యమైన 7 మాటలను వారు సంఘ యవ్వనస్తులతో వివరంగా చెప్పుతూ..(1)వ మాట తండ్రి వీరేమి చేయుచున్నారో వీరేరుగరు కనుక వీరిని క్షమించుము లూకా 23:34,(2)వ మాట నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిచ్చయముగా నీతో చెప్పుచున్నాను. లుకా : 23 : 43, (3)వ మాట అమ్మ, ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి యోహాను19:26,27(4)వ మాట నా దేవా నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివి. మార్కు15 : 34.(5)వ మాట నేను దప్పికొనుచున్నాను. యోహాను19 : 28.(6)వ మాట సమాప్తమైనది. యోహాను 19 : 30.(7)వ మాట తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. లూకా 23:46. బైబిల్ వాక్యాదారాలతో ఏసుప్రభు సిలువలో పలికిన ఈ యొక్క ఏడు మాటలను వివరిస్తూ, ఏసుక్రీస్తు ఈ రోజు సమస్త మానవాళి పాపము కొరకై రక్తమును కార్చి పాపపరిహారం జరిపించాడు అని వివరిస్తూ క్రీస్తు సిలువ సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు, పలు గ్రామాల విశ్వాసులు, జీసస్ లవ్స్ ప్రేయర్ టీం సభ్యులు, పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఒకరికొకరు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియ పరచుకున్నారు.