పద్మశ్రీ మంద కృష్ణ మాదిగకు ఘనస్వాగతానికి భారీ ఏర్పాట్లు

పద్మశ్రీ మంద కృష్ణ మాదిగకు ఘనస్వాగతానికి భారీ ఏర్పాట్లు

పద్మశ్రీ మంద కృష్ణ మాదిగకు ఘనస్వాగతానికి భారీ ఏర్పాట్లు

వెంకటాపురం నూగూరు, తెలంగాణజ్యోతి : పద్మశ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ ఢిల్లీ నుండి ఈ నెల 31న వరంగల్ రాక సందర్భంగా ఘన స్వాగతం పలకడానికి ఎమ్మార్పీఎస్, ఎంఎస్‌పీ, ఆధ్వర్యంలో భారీ ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ మండల సమావేశంలో వెల్లడించారు. ఈ సమావేశం బుధవారం వెంకటాపురం మండల కేంద్రంలోని చర్చి ఆవరణలో మండల అధ్యక్షుడు తోకల శివ మాదిగ అధ్యక్షతన నిర్వహించగా ముఖ్య అతిథులుగా ములుగు జిల్లా ఇన్‌చార్జ్, ఆంధ్రప్రదేశ్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి దుడ్డు రామకృష్ణ మాదిగ, ఎంఎస్‌పీ ములుగు జిల్లా అధ్యక్షుడు మడిపల్లి శ్యాంబాబు మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు పుల్లూరి కరుణాకర్ మాదిగ తదితరులు హాజరయ్యారు. ఈ నెల 31వ తేదీ ఉదయం 10 గంటలకు వరంగల్ రైల్వే స్టేషన్ వద్ద పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ కు ఘన స్వాగతం పలకాలని పిలుపునిస్తూ వెంకటాపురం, వాజేడు మండలాలకు చెందిన ప్రతి గ్రామం నుండి ఎమ్మార్పీఎస్ మరియు అనుబంధ సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని నాయకులు కోరారు. అదేరోజు హనుమకొండ లోని కాళోజి కళాక్షేత్రంలో ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యవర్గ సదస్సు జరగనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనుబంధ సంఘాల నాయకులు, కవులు, కళాకారులు, విద్యార్థులు, మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని సమావేశం కోరింది. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గుద్దేటి చంటి మాదిగ, అధికార ప్రతినిధి వేల్పుల మనోజ్ మాదిగ, నేతలు యాసం వెంకటేష్, నవీన్, వంశి, ఆనంద్, నాగార్జున, స్వామి, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.

 

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment