ఘనంగా షిర్డీసాయి బాబా దేవాలయ వార్షికోత్సవ వేడుకలు
– ప్రత్యేక పూజలు, మహా అన్నదానం.
ఏటూరునాగారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : మండల కేంద్రం లోని షిర్డీసాయి బాబా ఆలయం 23 వసంతాలు పూర్తి చేసుకొని 24 వ (రెండవ పుష్కరిణి ) వసంతం లోకి అడుగు పెడుతున్న సందర్భంగా సోమవారం వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ఎల్ల ప్రగఢ నాగేశ్వరరావు శర్మ, సూర్య నారాయణ శర్మ, రాధాకృష్ణ శర్మ, భానుప్రకాష్ శర్మ, మణిశర్మ లు, నూతన కమిటీ ఆధ్వర్యంలో ఉదయం నుండి సాయి నాదునికి ప్రత్యేక అభిషేకాలు, పూజ కార్యక్రమాలు, అర్చనలు, సాయి శరణు ఘోష లతో ఆలయం అంతా భక్తులతో కిట కిట లాడింది. అనంతరం అలంకరణలతో ,సాయి నాధుని, ఆలయంలో ఉన్న దేవతా మూర్తులను భక్తులు దర్శించుకుని తన్మయత్వం పొందారు. ఈ కార్యక్రమానికి సిఐ మండల రాజు దంపతులు, స్థానిక ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్ విచ్చేసి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన పలువురికి నూతన కమిటీ శాలువలతో, సత్కరించి అర్చకులు ఆశీర్వచనం చేశారు.సాయి నాధుని ఆశీస్సులు ఎల్లా వేళలా ఉండాలని దీవెనలు అందించారు. మధ్యాహ్న హారతి అనంతరం పక్కన గల సాయి నాధుని మినీ ఫంక్షన్ హాల్లో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో 2 వేల మందికి పైగా అన్న ప్రసాదం స్వీకరిం చారు. అనంతరం భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. దాతల సహకారంతో ఆలయాన్ని అత్యంత సుందరీ కరణ పనులు, చేయించి విద్యుత్ దీపాలను అలంకరించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ పెండ్యాల ప్రభాకర్, ఉపాధ్యక్షుడు కుమార స్వామి, ప్రధాన కార్యదర్శి బచ్చు సతీశ్, తదితరులు భక్తులు పాల్గొన్నారు.