గోదావరి ఇసుక సొసైటీ క్వారీల ఏర్పాటు కోసం గ్రామ సభలు
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలం లో ఐదు గోదావరి ఇసుక క్వారీ సొసైటీల ఏర్పాటు ఆమోదం కొరకు 21 డిసెంబర్ 2023 గురువారం న పీసా గ్రామ సభలు ఏర్పాటు చేయాలని భద్రాచలం ఐ.టి.డి.ఏ ప్రాజెక్టు అధికారి ఉత్తర్వులు చేశారు. ఈ మేరకు వెంక టాపురం మండల పరిషత్ అభివృద్ధి అధికారి, ఆయా ఐదు గ్రామా ల్లో పీసా గ్రామ సభలు ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు వివిధ శాఖల అధికారుల తో పాటు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడి యాకు, వెంకటాపురం ఎంపీడీవో బుధవారం ఉదయం ఆహ్వానం పంపించారు. వెంకటాపురం మండలంలోని వీరభద్రవరం 4వ నెంబ ర్, పూజారి గూడెం, రామచంద్రపురం నాలుగో నెంబర్, యాకన్న గూడెం 02, సుబ్రహ్మణ్యం కాలనీ తదితర అయిదు గోదావరి ఇసుక క్వారీల సొసైటీల ఏర్పాటు ఆమోదం కొరకు ఆయా గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసేందుకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం ఒకే రోజు ఐదు గోదావరి ఇసుక సొసైటీ ల ఆమోదం కొరకు గ్రామసభల సమయాల షెడ్యూల్ ను అదికారులు విడుదల చేశారు. ఈ మేరకు ఇసుక క్వారీల సొసైటీలు ఏర్పాటు, ఆమోదం కొరకు ఏర్పాటు చేసే గ్రామ సభలలో ఎటువంటి గొడవలు జరగ కుండా ముందుస్తు లో భాగంగా ఆయా శాఖలకు, జిల్లా ఉన్నతా ధికారులకు, మండల అధికారులకు ఈ మేరకు రెండు మూడు రోజులు ముందే సమాచారాన్ని చేరవేశారు. ఆయా పీసా గ్రామాల సభ లు సభలు శాంతి యుతంగా స్వేచ్చగా ఓటింగ్లో పాల్గొనే ఆది వాసీల ఆమోదంతో జరిగేందుకు ,రక్షణ చర్యలు తీసుకోవాలని ఈ మేరకు భద్రాచలం ఐటిడిఎ పి.ఓ. ఉత్తర్వు లు లేఖ ద్వారా సంబం ధిత అధికారులకు తెలియపరచినట్లు సమాచారం.
1 thought on “గోదావరి ఇసుక సొసైటీ క్వారీల ఏర్పాటు కోసం గ్రామ సభలు”