పట్టభద్రుల ఓటర్ల సమావేశం
పట్టభద్రుల ఓటర్ల సమావేశం
తెలంగాణ జ్యోతి, ఏటూరు నాగారం : ఏటూరునాగారం, తాడ్వాయి, మంగపేట, మండలాలలో జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమరి లక్ష్మినర్సింహారావు, జడ్పీ చైర్మన్ బడే నాగజ్యోతి ల ఆధ్వర్యంలో పట్టభద్రుల ఓటర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో చదువుకున్న మేధావులు పట్టభద్రులు ఆలోచించి తమ అమూల్య మైన ఓటును ఏనుగుల రాకేష్ రెడ్డికి వేసి గెలిపించాలని కోరారు.