కల్లుగీత కార్మికుల క్యాలెండర్ ఆవిష్కరణ
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి : కల్లుగీత కార్మికుల సంఘం ముద్రించిన క్యాలెండర్ ను శనివారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుని ఆదేశాల మేరకు రాష్ట్ర కార్యదర్శి మారగొని శంకర్ గౌడ్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు అరిగెల వెంకటరాజం ఆవిష్కరించారు. రాష్ట్ర అధ్యక్షుని ఆదేశాల మేరకు కాటారం మండలం దామరకుంటలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మండలాధ్యక్షుడు మంతెన రాజనర్సు, దామరకుంట సింగిల్ విండో సొసైటీ డైరెక్టర్ రామగుండం శ్రీనివాస్, మాజీ సర్పంచ్ కనుకుట్ల సమ్మయ్య, కట్కూరి రామారావు, స్వామి యాదవ్ లతోపాటు ఆ సంఘం నాయకులు పల్లె శీను గౌడ్, కాటారం పోష గౌడ్, మల్లయ్య గౌడ్, లక్ష్మయ్య గౌడ్, బాలరాజ్ గౌడ్, వినోద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.