గోండ్వానా సంక్షేమ పరిషత్ రిలే నిరాహారదీక్షలు
– మద్దతు తో సంఘీభావం తెలిపిన ఆదివాసీ నాయకులు. సంఘాలు
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయం ముందు బుధవారం గొండ్వానా సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ములుగు జిల్లా అధ్యక్షులు రేగ గణేష్ అధ్యక్షతన చేప ట్టిన 24 గంటల రిలే నిరాహార దీక్షలను జి.ఎస్పి రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ గత ప్రభుత్వ పాలనలో ఓటు బ్యాంకు కోసం 11 ఉప కు లాలను కోయ తెగలకు చెందిన ఎస్టీ జాబితాలో చేర్చడం చాలా దుర్మార్గమైన చర్యని విమర్శించారు. ఈ ఆలోచనను వెంటనే నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఆనాడు కాంగ్రెస్ పార్టీ 1960లో సొంత రాజికియ లబ్ధి కోసం లంబాడీలను ఎస్టీ జాబితాలో కలిపి ఆదివాసులకు తీరని అన్యాయం చేశారని అన్నారు., ప్రభుత్వాలు ఎన్ని మారినా కానీ ఆదివాసుల పట్ల చవితి తల్లి ప్రేమ చూపుతూ ఆదివాసులను నట్టేట ముంచుకున్నారని ఆయన అన్నారు.,అనంతరం రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి మాట్లాడుతూ,ఏజెన్సీ చట్టాలను నిర్వీ ర్యం చేస్తున్నారని అధికారుల నిర్లక్ష్య ధోరణి వల్ల 1/70 చట్టం తూట్లు పొడుస్తూ యదేచ్చగా గిరిజనేతరులు మైదాన ప్రాంతాల నుండి ఏజెన్సీ ప్రాంతాలకు వలస వచ్చి చిన్న చితక వ్యాపారాలతో మొదలుపెట్టి నేడు కోట్ల రూపాయలకు పడగలెత్తుతున్నారని ఇది కేవలం ఆదివాసి అమాయకత్వం వల్లే జరుగుతుందని విమర్శిం చారు. వలసలుగా వచ్చి న గిరిజనేతరులు దోచుకు తింటున్నారని .ఆయన మండిపడ్డారు.టిఆర్ఎస్ ప్రభుత్వం దశాబ్ది కాల పాలనలో నిరుద్యోగ యువతకు కనీసం ఒక్క ఉద్యోగం కూడ ఇవ్వలేని పరి స్థితి ఏర్పడిందని, ఏజెన్సీ డీఎస్సీని నిర్వహించకుండా నిరుద్యోగుల ను, గూడాలకే పరిమితం చేశారని ఆయన అన్నారు.,అనంతరం ఆదివాసీ నవనిర్మాణ సేన వ్యవస్థాపక అధ్యక్షులు కొరస నరసింహ మూర్తి దీక్ష శిబిరాన్ని సందర్శించి ఆయన పూర్తి మద్దతు ప్రకటించా రు. గోండ్వానా సంక్షేమ పరిషత్ చేపట్టిన 24 గంటల రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలుపుతూ, ఆయన మాట్లాడారు.ఆనాడు 1960 లో కూరు కమిషన్ కమిటీ ఇతర కులాల్ని ఎస్టీ జాబితాలో చేర్చా లంటే ఆదివాసులకుండే ప్రత్యేక సాంస్కృతి సాంప్రదాయాలు వారి ప్రత్యేక భాష కలిగి ఉండాలని, చెబుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వా లు ఇవేమీ పట్టించుకోకుండా,సాంప్రదాయమైన కోయ తెగల ఎస్టి జాబితాలో చేర్చాలని చూస్తే ప్రభుత్వం ఒక దుర్మార్గపు చర్యా అని ఆయన తెలిపారు, అలాగే ఏజెన్సీ ప్రాంతంలోని చట్టాలను అధికా రుల నిర్లక్ష్యంతోనే దుర్వినియోగం అవుతున్నాయని, దీనికి ముంద డుగు గా ఆదివాసి యువత రావాలని ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివా సి యువత, రాజకీయ పార్టీల వైపు మొగ్గు చూపుతూ మన మను గడని మర్చిపోతున్నారని అన్నారు. ఒకసారి యువత దీర్ఘ ఆలోచ న చేసి మన మనుగడని కాపాడుకోవాలంటే, యువత పూర్తిస్థాయి లో ఉద్యమాలు చేపట్టాలని ఆయన తెలిపారు.వర్కింగ్ ప్రెసిడెంట్ వాసం నాగరాజు దీక్ష శిబిరంలో పాల్గొని., వాజేడు, వెంకటాపురం రెండు మండలాలు ఎటు వెళ్లాలని దిక్కుతోచని పరిస్థితిలో ఐటీ డీఏ కార్యాలయాలు చుట్టు తిరుగుతున్నారని, సమస్యలపై ఏటూ రు నాగారం ఐటీడీఏ వెళ్తే మా పరిధి కాదంటూ అధికారులు, ప్రశ్నిం చిన ఆదివాసి నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని, ఓటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వేస్తూ, జిల్లాని ములుగు చెయ్యడం ఇది చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. అలాగే ఏజెన్సీ ప్రాంతంలోని ఉన్న 1/70 చట్టన్ని చిన్నచూపు చూస్తే రాజకీయ పార్టీలను, ఆదివాసి గళం ఎత్తి తరిమి కొడతామని, ఓట్ల కోసం గ్రామీణ ప్రాంతాలకు వస్తే ఖబర్దార్ అని హెచ్చరించారు. ఏజె న్సీ ప్రాంతంలో ఎల్టిఆర్ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా, అధికా రులు నిర్లక్ష్యం వహిస్తూ,కాసులకి కక్కుర్తి పడుతూ అధికారులు ఎల్టిఆర్ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ ఉంటే, రానున్న రోజుల్లో గోండ్వా నా సంక్షేమ పరిషత్ తో కలిసి, ముందు ముందు ఇంకా ఉద్యమా లు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు జాయింట్ కమిటీ సుధాకర్ మాట్లాడుతూ. ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేస్తూ గిరిజనేతలు కబంధహస్తాలకు దాసోహం చేస్తున్నారని అధికారులు ఏజెన్సీ ప్రాంతంలో ఎల్ టి ఆర్ చట్టం ప్రకారంగా గిరిజనేతరులు ప్రభుత్వ భూములను క్రయ,విక్రయాలు చేయకూడదని అలాంటి చట్టాలు ఉన్నప్పటికీ అధికారులు నిర్లక్షణ ద్వారా చూపిస్తూ ప్రభు త్వ భూములను గిరిజనేతరుల చేతిలో పెడుతున్నారని వెంటనే ఇవన్నీ ఆపకపోతే ప్రభుత్వంపై, అధికారులపై ఉద్యమం తో ఒత్తిడి చేస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా అధికారులు రక్షణ కల్పించి,ఆదివాసి నిరుపేదలకు, భూములు పంచాలని ఆయన డిమాండ్ చేశారు. గొండ్వానా సంక్షేమ పరిషత్ 24 గంటల దీక్ష కార్యక్రమంలో ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటకృష్ణ,ములుగు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పూనెం ప్రతాప్,ఉపాధ్యక్షులు చింత మోహన్, ఏఎస్పి జిల్లా అధ్య క్షులు పర్శికా సతీష్,ఏవీఎస్పీ ములుగు జిల్లా అధ్యక్షులు బొదె బోయిన సురేష్,తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి పడిగ నాగేశ్వర రావు, ఏటిఏ ఉపాధ్యాయ జిల్లా కమిటీ అట్టం రామారావు,చేల ప్రసాద్,పూనెం విజయ్,కృష్ణార్జున్ రావు, ఆదినారాయణ, మహేష్, కలేట్ నాగరాజు,యలం శంకరయ్య,అల్లం రాంబాబు,బొగ్గుల నాగేష్,ధర్మయ్య,నారాయణ,అజయ్, సాంబశివరావు, లక్ష్మయ్య, సుధాకర్ పూనెం వంశీ,వాసం లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
1 thought on “గోండ్వానా సంక్షేమ పరిషత్ రిలే నిరాహారదీక్షలు”