ఇసుక క్వారీలకు ఫ్రీగా వెళ్లండి
మహాదేవపూర్,తెలంగాణజ్యోతి:మహాదేవపూర్ మండలం లోని మద్దులపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గల ఇసుక క్వారీలు వెళ్లే మార్గంలో ఇసుక కాంట దగ్గర మరియు గ్రామ పంచాయతీ నందు ఇసుక క్వారీలలో గ్రామపంచాయతీ ఎటు వంటి ఎంట్రీ ఫీజులను వసూలు చేయడం లేదని ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగినది. ఇక్కడ గ్రామ పంచాయితీ కి సంబంధం లేకున్నా గ్రామ పంచాయితీ పేరు తో ప్రవేశ రుసు ము వసూలు చేస్తున్నట్లు వస్తున్నా ఆరోపణల నేపధ్యంలో భూపాలపల్లి జిల్లా పంచాయితీ అధికారి ఆదేశాల మేరకు ఇక్కడకు వచ్చే లారీ డ్రైవర్స్ లకు ఈ విషయాన్ని తెలియ జేయడం జరిగినది. అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం తదు పరి చర్యలు తీసుకోబడునని మద్దులపల్లి గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి గ్రామ పంచాయతీ కార్యదర్శి తెలిపారు.