గారేపల్లి బాలికకు రాష్ట్రస్థాయిలో సిల్వర్ మోడల్
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన స్పోర్ట్స్ ఫర్ ఆల్ క్రీడోత్సవాలలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గారేపల్లికి చెందిన రామిళ్ల అనయ అనే బాలిక సిల్వర్ మోడల్ కేవలం చేసు కుంది. ఈనెల 15, 16 తేదీలలో హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడి యంలో జరిగిన స్పోర్ట్స్ ఫర్ ఆల్ ఛాంపియన్ షిప్ లో భాగంగా ఆర్చరీ విభాగంలో అండర్ టెన్ కాంపౌండ్ విభాగం లో రామిళ్ళ రాజశేఖర్ కూతురు రామిల్ల అనయ రాష్ట్ర స్థాయిలో సిల్వర్ మోడల్ సాధించింది . ఈ సందర్భంగా కోచ్ డి శ్రీనివాస్ అభినందనలు తెలిపారు. అలాగే కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ నుండి అభినందనలు తెలిపారు. గారేపల్లికి చెందిన రామిల్ల అనయ ఎంపిక కావడం పట్ల స్థానికులు సంబరాలు చేసుకున్నారు.