గండ్రకోట సుధీర్ సేవా ఫౌండేషన్ చేయూత
ములుగు, తెలంగాణ జ్యోతి : ములుగు పట్టణ కేంద్రం లోని పరికరాల రవి కుమార్తె సౌమ్య ఇటీవల అనారోగ్యంతో మరణించగా విషయం తెలుసుకున్న గండ్రకోట సుధీర్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేయూతనందించారు. సోమవారం గండ్రకోట సుధీర్ యాదవ్ సేవా ఫౌండేషన్ సభ్యులు సౌమ్య కుటుంబ సభ్యులను పరామర్శించి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఇలాంటి సందర్భంలోనే ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులను వారు ఓదార్చారు. గండ్రకోట సుధీర్ సేవా ఫౌండేషన్ చేయూత ఆధ్వర్యంలో 50 కేజీల బియ్యం అందించారు. ఈ కార్యక్రమం లో ఎనగందుల వెంకటేష్, శ్రవణ్, సాధిక్, రాజు, అజ్మీరా రాజు నాయక్, సతీష్, ప్రదీప్, అంజిత్, సంపత్, సందీప్, రాజు లతో పాటు తదితరులు పాల్గొన్నారు.