ప్రశాంతంగా గణపతి నవరాత్రులు నిర్వహించాలి
ప్రశాంతంగా గణపతి నవరాత్రులు నిర్వహించాలి
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని కాటారం డి.ఎ స్.పి గడ్డం రామ్మోహన్ రెడ్డి కోరారు. శుక్రవారం కాటారం పోలీస్ స్టేషన్ ఆవరణలో గణపతి నవరాత్రి ఉత్సవాల నిర్వా హకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాటారం సర్కిల్ ఇన్ స్పెక్టర్ ఈఊరి నాగార్జున రావు, సబ్ ఇన్ స్పెక్టర్ మ్యాక అభినవ్ పాల్గొన్నారు. శబ్ద కాలుష్యాన్ని నివారించాలని పోలీసు అధికారులు నిర్వాహకులకు సూచిం చారు. విద్యుత్తు బల్బులు ఇతర ఏర్పాట్లలో జాగ్రత్తలు వహిం చాలని పేర్కొన్నారు. హోరెత్తించే మైకులు, డిజె సౌండ్ లను నిలవరిం చాలని హుకుమ్ జారీ చేశారు. యువత మత్తు మద్యం సేవించి ఊరేగింపుల్లో పాల్గొన రాదని వివరించారు. నిబంధనలను అతిక్రమించి నట్లయితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరికలు జారీ చేశారు.