ఎన్ హెచ్ ఆర్ సి ఏటూరునాగారం మండల అధ్యక్షులుగా గంపల శివకుమార్

ఎన్ హెచ్ ఆర్ సి ఏటూరునాగారం మండల అధ్యక్షులుగా గంపల శివకుమార్

తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం : జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య ఆదేశాల మేరకు ములుగు జిల్లా ఏటూరునాగారం మండల  అధ్యక్షులుగా గంపల శివకుమార్ ను నియమించినట్లు జిల్లా అధ్యక్షులు పెట్టెం రాజు ప్రకటించారు. పేద ప్రజల సమస్యల పరిష్కారం ధ్యేయంగా అవినీతి అక్రమాలకు తావులేని సమాజం కోసం రాష్ట్ర, జిల్లా కమిటీల ఆదేశాల మేరకు పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఏటూరునాగారం మండల అధ్యక్షుడు నియమి తులైన గంపల శివకుమార్ మాట్లాడు తూ తనపై నమ్మకంతో తనకి ఈ పదవి కట్టబెట్టిన రాష్ట్ర, జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండే జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి)ని మండలంలో, జిల్లాలో బలోపేతం కోసం కృషి చేస్తానని అన్నారు. మండలంలో అన్ని గ్రామ కమిటీలను పూర్తిచే స్తానని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుం టానని స్పష్టం చేశారు.