బీజేపీ ములుగు మండల అధ్యక్షునిగా గాదం కుమార్
ములుగు, తెలంగాణ జ్యోతి : భారతీయ జనతా పార్టీ ములుగు మండల నూతన అధ్యక్షునిగా బిజెపి సీనియర్ నాయకుడు గాదం కుమార్ ఎన్నికయ్యారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం నియామకపు ఉత్తర్వులు అందించారు. అనంతరం బలరాం మాట్లడుతూ గత కోన్ని సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీకి సేవలు అందిస్తూ ఒక చురుకైన కార్యకర్త పని చేయడమే కాకుంగా 2017-19 పీరియడ్ లో ములుగు మండల అధ్యక్షునిగా కుమార్ పని చేశారన్నారు. సుదీర్ఘకాలంగా బిజెపిలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ పార్టీ ఎదుగుదలకు ఎంతో కృషి చేసిన ఆయన ఇటీవల ముగిసిన గ్రామ పంచాయతీ 11వ వార్డు సభ్యునిగా (గాదం మాధవి కుమార్) సైతం ప్రజలకు సేవలందించారు. కుమార్ మాట్లడుతూ పార్టీ ఇచ్చిన కార్యక్రమంలో నా వంతు పాత్రను నిర్వహిస్తూ చురుకైన కార్యకర్తగా గుర్తింపు పొందినందున నాపై నమ్మకంతో మరో సారి ములుగు మండల అధ్యక్షునిగా బాధ్యతలు అప్పగించినందుకు జిల్లా అధ్యక్షుడితో పాటు పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్య దర్శి కొత్త సురేందర్, జిల్లా ఉపాధ్యక్షులు భూక్య జవహర్ లాల్, జిల్లా కార్యాలయ కార్యదర్శి చల్లురి మహేందర్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు జినుకల కృష్ణకర్, జిల్లా ప్రచార కార్యదర్శి దొంతిరెడ్డి రవి రెడ్డి, జిల్లా నాయకులు అలె శోభన్, పెరబోయిన హేమాద్రి యాదవ్, గంగిశెట్టి రాజ్ కుమార్, రాయంచు నాగరాజు, బిజెవైయం జిల్లా ఉపాధ్యక్షులు కత్తి హరీష్, భైకని మహేందర్ తదితరులు పాల్గొన్నారు.