వెంకటాపురం ఎంపీడీవో గా జి. రాజేంద్రప్రసాద్.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా జి. రాజేంద్ర ప్రసాద్ నియమితులు కాగ ఆయన పదవి బాధ్యతలు స్వీకరించారు. హనుమకొండ జిల్లా నడికుడి మండలంలో ఎంపీడీవో గా పనిచేస్తున్న జి. రాజేంద్రప్రసాద్ ఉమ్మడి వరంగల్ జిల్లా బదిలీల్లో భాగంగా నూగూరు వెంకటాపురం ఎంపీడీవోగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో గత 20 నెలలుగా విధులు నిర్వహించిన ఎంపీడీవో అడ్డూరి బాబు కాటారం మండలం, ఎంపీడీవో గా బదిలీ అయినట్లు సమాచారం. నూత నంగా పదవి బాధ్యతలు స్వీకరించిన ఎంపీడీవో జి. రాజేంద్రప్రసాద్ ను కార్యాలయం సిబ్బంది, వివిధ విభాగాల శాఖల అధికారులు అభినంద నలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన ఎంపీడీవో మాట్లాడుతూ మండల అభివృద్ధి ధ్యేయంగా అన్ని శాఖల అధికారులతో పాటు, గౌరవ ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు, సంఘాలతో సమన్వయంతో, విధులు నిర్వహించి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు మండలం లో అమలు చేసేందుకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.