వెంకటాపురం –  చర్ల రహదారిలో తరచు ట్రాఫిక్ స్తంభన 

వెంకటాపురం -  చర్ల రహదారిలో తరచు ట్రాఫిక్ స్తంభన 

వెంకటాపురం –  చర్ల రహదారిలో తరచు ట్రాఫిక్ స్తంభన 

ఇబ్బంది పడుతున్న ప్రజలు – పట్టించుకోని అధికారులు

వెంకటాపురంనూగూరు, తెలంగాణాజ్యోతి: వెంకటాపురం – చర్ల ప్రధాన రహదారి వీరభద్రారం నుండి రామచంద్రపురం, ఆలుబాక, కొండాపురం, సూరవీడు, ఎదిర వరకు ఇసుక లారీలు కారణంగా తరచూ ట్రాఫిక్ గంటల తరబడి స్తంభించి పోతున్నది. దీంతో వెంకటాపురం భద్రాచలం అక్కడి నుండి వెంకటాపురం చర్ల రాకపోకలు సాగించే ఆర్టీసీ ప్రయా ణికులు, ఇతర వాహనదారులు, ప్రతిరోజు టాపిక్ వలయంలో గంటల తరబడి చిక్కుకు పోతున్నారు. రోడ్లు భవనాల శాఖ కాంట్రా క్టర్ మెటల్ పోసి బీ.టి.వేయకపోవడంతో వర్షాలు కారణంగా గోతులు పడి, గోతుల్లో నీరు చేరి, ఇసుక లారీలు కారణంగా లారీలు దిగబడి ఇబ్బందుల పాలవుతున్నారు. ప్రతినిత్యం ట్రాఫిక్ సమస్యతో ఈ ప్రాంతానికి రావాలంటే జంకుతున్నారు. ప్రతినిత్యం వందల ఇసుక లారీలు చర్ల వెంకటాపురం రహదారిపై రాకపోకలు సాగిస్తున్నాయి. ట్రాఫిక్ జామ్ లో స్కూల్ బస్సులు, ఆర్టీసీ బస్సులు, గంటలు తరబడి నిలిచి పోవటంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మంగళవారం సాయంత్రం వీరభద్రారం, రామచంద్రపురం కొండాపురం ప్రాంతం మధ్య గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించి పోవడంతో ప్రైవేట్ స్కూలు బస్సుల పిల్లలు, బస్సులోనే ఉండి దాహానికి అల్లాడిపోయారు. చిన్నారుల తల్లిదండ్రులు బస్సుల వద్దకు వచ్చి తమ పిల్లలను తీసుకువెళ్లారు. ట్రాఫిక్ సమస్య పై అధికారులు స్పందించి రాకపోకలు క్లియర్ అయ్యేవిధంగా, ఇసుక లారీలను నియంత్రణ చేయాలని, ప్రజలు పత్రికా ముఖంగా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.