మేడారం ముందస్తు జాతర వైద్య శిబిరం
– వైద్య శిబిరాన్ని సందర్శించిన డి ఎం & హెచ్ ఓ
– ఆర్బిఎస్కే వైద్యాధికారి డా నరహరి
మేడారం, ఫిబ్రవరి 16, తెలంగాణ జ్యోతి : మేడారం లోని హరిత హోటల్ వద్ద ఆర్బిఎస్కే ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని జిల్లా వైద్యాధికారి అల్లెం అప్పయ్య సందర్శించారు. శుక్రవారం ఆర్ బి ఎస్ కే వైద్యాధికారి డాక్టర్ బి నరహరి ఆధ్వర్యంలో మేడారం లోని హరిత హోటల్ వద్ద మేడారం ముందస్తు జాతర సందర్భంగా మొక్కులు చెల్లించడానికి వస్తున్న, తిరిగి వెళ్తున్న భక్తులకు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డా నరహరి మాట్లాడుతూ మేడారం జాతర వనదేవతలను దర్శించుకోవడానికి వస్తున్న & జాతర నుండి వెళ్తున్న భక్తులు అనారోగ్యం భారిన పడిన భక్తులను వైద్య పరంగా పరీక్షించి వారికి తగిన మందులు అందించి ఆరోగ్యపరంగా సూచనలు అందించామన్నారు. ఈ కార్యక్రమంలో ఫార్మాసిస్ట్ భాస్కర్, ఏఎన్ఎం రజిత వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.