గంటగూడెంలో ఉచిత ఆరోగ్య శిబిరం
గంటగూడెంలో ఉచిత ఆరోగ్య శిబిరం
కాటారం ప్రతినిధి, తెలంగాణ జ్యోతి: కాటారం మండల కేంద్రమైన కాటారం గ్రామంలోని గంటగూడెంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వర్షాకాలం కారణంగా విష జ్వరాలు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎం మౌనిక మాట్లాడుతూ వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇంటి చుట్టూ నీటి నిల్వలు ఉండకుండా చూసుకోవాలని అన్నారు. ఇంటి ఆవరణలో పాత టైర్లు, కొబ్బరి బొండాలు లేకుండా చూసుకోవాలి. కూలర్ లో నీటి నిల్వ ఉన్నట్లయితే ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేసుకొని శుభ్రమైన నీటిని వాడాలన్నారు. దోమలు ఈగలు వాడిన పదార్థాలు తినరాదు అని చెప్పారు. వర్షాకాలంలో ఎప్పటికీ అప్పుడు వండినటువంటి వేడి పదార్థాలనే ఆహారంగా తీసుకోవాలని సూచించారు. అలాగే గ్రామంలో పర్యటిస్తూ ప్రతి ఇంటింటికి తిరిగి డ్రై డే కూడా నిర్వహించారు. అలాగే ఇంటింటికి తిరిగి జ్వర సర్వే కూడా చేశారు . దోమతెరలు వాడాలని అలాగే దోమలు కుట్టకుండా పిల్లలు, పెద్దలు కాళ్ల, చేతులకు ఫుల్ షర్ట్స్, ఫుల్ పాయింట్స్ వేసుకోవాలని పేర్కొన్నారు. ఇంట్లో దోమలు ఉండకుండా మస్కిటో కాయిల్స్ వాడాలని వివరించారు. బజారులో దొరికే హిట్ స్ప్రే చేసుకోవాలని, ప్రజలు ముందు జాగ్రత్తగా సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మౌనిక, డాక్టర్ గీతా రాణి, డాక్టర్ ప్రియాంక, ఆరోగ్య విస్తరణ అధికారి తిరుపతి రెడ్డి, హెల్త్ అసిస్టెంట్ తేజావత్ సమ్మయ్య, ఏఎన్ఎం శ్యామల, ఆశా కార్యకర్తలు రాజేశ్వరి, లత, సమ్మక్క, సత్యమ్మ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.