గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు యువకులు అరెస్టు

Written by telangana jyothi

Published on:

గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు యువకులు అరెస్టు

కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: నిషేధిత గంజాయిని సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు కాటారం ఎస్ ఐ అభినవ్ తెలిపారు. కాటారం పోలీస్ లకు వచ్చిన సమాచారం మేరకు కొందరు వ్యక్తులు అక్రమంగా నిషేధిత గంజాయి రవాణా చేస్తున్నట్టు సమాచారం అంద డంతో కాటారం ఎస్ ఐ అభినవ్ చింతకాని క్రాస్ వద్ద సిబ్బం దితో కలిసి మాట వేసి పట్టుకున్నట్లు ఎస్ఐ వివరించారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట గ్రామానికి చెందిన బొంతల రమేష్, టి ఎస్ 03 ఎఫ్ సీ 95372 అనే నెంబర్ గల ద్విచక్ర వాహనంపై తెస్తున్న గంజాయిని భూపాలపల్లి కి చెందిన సాదు వినయ్, మలహర్ మండలం కొయ్యూరు కు చెందిన లకావత్ రాహుల్, కాటారం చెందిన జాడి గణేష్ లకు గంజాయిని అమ్ముతుండగా పట్టుకున్నట్లు తెలిపారు. నిందితుల దగ్గర నుండి 1.4 కేజీల నిషేధిత గంజా యిని స్వాధీనం చేసుకున్నారు. సదరు గంజాయిని మహారా ష్టలోని గుర్తు తెలియని వ్యక్తి దగ్గర 28 వేలు చెల్లించి కొను గోలు చేసినట్లు బొంతల రమేష్ ఒప్పుకున్నట్లు తెలిపారు. నిందితుల నుండి రెండు బైకులు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ ఐ తెలిపారు. అనంతరం పైన తెలిపిన వారిని కస్టడీ లోకి తీసుకొని చట్ట ప్రకారం వారిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించడం జరిగింది . ఇట్టి కార్యక్రమం లో కాటారం కానిస్టేబుల్స్ హరి కుమార్, జంపన్న, సాంబశివరావు, శ్రీనివాస్, రఘు, లవన్, లక్మిరాజ్, హోంగార్డు తిరుపతి పాల్గొన్నారు. యువత గంజాయి భారిన పడి తమ జీవితాలు నాశనం చేసుకోవద్దని ఎస్ ఐ సూచించారు. గంజాయి రవాణా, విక్రయాలపై పోలీసుల నిరంతర నిఘా ఉంటుంది అని, స్మగ్లింగ్ చేస్తే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. తల్లి దండ్రులు తమ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని వారి నడవడికపై దృష్టి పెట్టాలని ఎస్ ఐ కోరారు. యువత సన్మార్గంలో వెళ్ళాలి అని గొడవల జోలికి వెళ్తే కేసులు నమోదు చేయడం జరుగుతుందని కేసుల పాలవుతే భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఎస్ ఐ తెలిపారు.

Leave a comment