గంజాయి పట్టివేత నలుగురు అరెస్టు
– సీ.ఐ బండారి కుమార్ వెల్లడి
వెంకటాపురం నూగూరు, తెలంగాణా జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం మరికాల రోడ్డు పాలెం ప్రాజెక్టు పాత భవనాల వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న నలుగురు వ్యక్తుల ను పోలీసులు తనిఖీ చేయగా వారి వద్ద ప్రభుత్వ నిషేధిత గంజాయి పట్టుబడింది. ఈ మేరకు ములు గు జిల్లా వెంకటాపురం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. కుమార్ గురువారం గంజాయి పట్టివేత వివరాలను మీడియాకు విడు దల చేశారు. సి.ఐ కుమార్ కధనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూ డెం జిల్లా భద్రాచలం ప్రాంతాల నుండి నూగూరు వెంకటాపు రం ప్రాంతానికి గంజాయిని విక్రయించేందుకు నిషేధిత గంజా యి తీసుకువస్తున్నట్లు నమ్మదగిన సమాచారంతో పోలీస్ శాఖ వ్యూహంతో పక్కాగా నిఘా ఏర్పాటు చేశారు. మరికాల రోడ్ లోని పాలెం ప్రాజెక్టు పాత కోటర్స్ వద్ద గంజాయి విక్రయించేందుకు సిద్ధంగా ఉండగా వారి వద్ద నుండి ఐదు కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న తోకల దుర్గాప్రసాద్, సంఖ్యా ప్రశాంత్, గుండ మళ్ళ రోహిత్, కుర్సం నీలకంఠ తదితర నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి అయిదు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ నిషే ధిత గంజాయి విలువ సుమారు లక్షా 27 వేల 500 రూ. ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. ఈ సందర్భంగా వెంకటాపురం సి.ఐ .బి. కుమార్ మాట్లాడుతూ యువత గంజాయి, మద్యం,ఇతర మత్తు పదార్థాలకు బానిసై బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని, ఎవరైనా ప్రభుత్వ నిషేధి త గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే పోలీస్ శాఖకు తెలియపరచాలని వెంకటాపురం సిఐ బి కుమార్ ప్రజల ను కోరారు.