వేటగాళ్ల విద్యుత్ ఉచ్చులో పడి నాలుగు పాడిగేదెలు మృతి
వేటగాళ్ల విద్యుత్ ఉచ్చులో పడి నాలుగు పాడిగేదెలు మృతి
– విచారణ జరిపి దోషులను శిక్షించాలని స్థానికుల డిమాండ్
తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం : వేటగాళ్లు వన్య ప్రాణుల కోసం అమర్చిన విద్యుత్ ఉచ్చులో పడి నాలుగు పాడిగేదెలు మృతిచెందిన సంఘటన ఏటూరునాగారం మండలం ముల్లకట్ట, రాంపూర్ శివార్లలో జరిగింది. అటవీ, పోలీసు శాఖ అధికారులు విద్యుత్ ఉచ్చులు పెట్టొద్దని పలుమార్లు హెచ్చరించినా పట్టించుకోవడంలేదు. దీంతో గ్రామస్థులు వేటగాళ్లపై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఏటూరునాగరాం మండలం ముల్లకట్ట, రాంపూర్ గ్రామాల చిన్నచెరువు శివార్లో వన్యప్రాణులను వేటాడేందుకు వేటగాళ్ళు అమర్చిన విద్యుత్ ఉచ్చుల్లో పడి నాలుగు పాడిగేదలు మృతి చెందాయని అటవిశాఖ అధికారులు తెలిపారు. వేసవికాలం కావడంతో వన్య ప్రాణులు దాహార్తికి చెరువు వద్దకు వస్తాయని గమనించిన వేటగాళ్లు నిత్యం పరిసరాల్లో విద్యుత్ ఉచ్చులు అమర్చు తున్నారు. సమాచారం తెలుసుకున్న అటవీ అధికారులు గ్రామస్తులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా వేటగాళ్లు మాత్రం పద్దతి మార్చుకోలేదు. రెండు రోజుల క్రితం రెండు పాడి గేదెలు విద్యుత్ ఉచ్చుల్లో పడి చనిపోగా అది మరువక ముందే శుక్రవారం నాలుగు పాడి గేదలు చనిపోయాయి. ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపి దోషులపై చట్టపరమైన చర్యలు చేపడతామని బీట్ అధికారి రూప్ సింగ్ తెలిపారు.