జక్కు కాలనీలో బోర్ మోటార్ బిగించిన మాజీ ఎంపీటీసీ జనార్ధన్
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : గత 20 రోజుల నుండి కాటారం గ్రామ పంచాయతీ లోని జక్కు కాలనీలో బోర్ మోటార్ చెడిపోయి నీరు రాక ఆ వాడ ప్రజలు పలుమార్లు అధికారులకు విన్నవించినప్పటికీ అధికారులు స్పందించక పోవడంతో వారు మాజీ ఎంపీటీసీ సభ్యుడు తోట జనార్దన్ ని కలిసి సమస్యను చెప్పడంతో వారు వెంటనే స్పందించి కొత్త బోరు మోటర్ ఇప్పించి దగ్గర ఉండి బిగించే విధంగా చూడ డం జరిగింది. కొత్త మోటర్ బిగించడంతో కాలనీ వాసులు జనార్దన్ కి కృతజ్ఞతలు తెలిపారు, ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు జాడి మల్లయ్య, రాజు, బానయ్య తదితరులు పాల్గొన్నారు.