మత్స్య కారులు చేపల వేటకు వెళ్లొద్దు

మత్స్య కారులు చేపల వేటకు వెళ్లొద్దు

మత్స్య కారులు చేపల వేటకు వెళ్లొద్దు

– భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి. 

– వాడ బలిజ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు డర్రా దామోదర్ 

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : తెలంగాణ రాష్ట్రంలో రాగల నాలుగు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు తో పాటు ఉరుములు, పిడుగులతో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిచ్చిందని మత్స్యకారులు ప్రజలు వాగులుతావద్దని చేపలవాటకు వెళ్ళ వద్దనీ వాడ బలిజ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు డర్రా దామోదర్ కోరారు. ముఖ్యంగా ములుగు జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం , ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, భూపాలపల్లి జిల్లా లలో అత్యధిక వర్షపాతం నమోదవుతుందని, ఆరంజ్ అలర్ట్ ను ప్రబుత్వం జారీ చేసింద ని తెలిపారు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని దీనితో పాటు ద్రోని ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ ఎత్తున వర్షాలు నమోదు అవుతున్నందున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం గా ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకి రాకూడదని, మత్స్యకారులు వేటకు వెళ్లరా దని పశు వుల కాపర్లు వాగులు, వంకలు దాటరాదని వచ్చే నాలుగు రోజులపాటు చాలా జాగ్రత్తగా ఇళ్లల్లోనే ఉండడం మంచిదని, అత్యవసర హాస్పటల్లో వైద్య చేయించు కొనుటకు తప్ప బయటికి వెళ్లడం సరి కాదని తెలిపారు. చిన్నపిల్లల్ని ఇంట్లో నుండి బయటకు పంపిం చకూడదు. ఎందుకంటే కుంభవృష్టి లాగా కురుస్తున్న భారీ వర్షాలకు కరెంటు స్తంభాల నుండి దగ్గర్లో ఉన్నటువంటి నీటి గుంటల్లో కరెంటు సప్లై అయ్యే అవకాశాలు ఉన్నాయి. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ వాడబలిజ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు డర్ర దామోదర్ విజ్ఞప్తి చేశారు.