బిట్స్ విద్యార్థినికి ప్రథమ బహుమతి
తెలంగాణ జ్యోతి, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా గోవిందరావు పేట మండలం చల్వాయి జడ్పీ హై స్కూల్ లో శుక్రవారం సైన్స్ విభాగం వరల్డ్ ఎన్విరాన్మెంట్ లో భాగంగా ఏర్పాటు చేసిన కవిత్వం(పోయెట్రీ) ములుగు జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. జిల్లా స్థాయిలోని వివిధ 29 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు పాల్గొనగా అందులో ములుగు బిట్స్ పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని గమన స్వేచ్ఛ ప్రథమ బహుమతి పొందింది.కాగా ములుగు జిల్లా విద్యాశాఖ అధికారి పాణిని చేతులమీదుగా రూ. 1,000 నగదు బహుమతి అందుకుంది.ఇందులో భాగంగా బాలాజీ విద్యా సంస్థల చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి,బిట్స్ పాఠశాల ప్రిన్సిపాల్ కే.రజనీకాంత్ గమన స్వేచ్ఛను,గైడ్ టీచర్ రతన్ సింగ్ ను అభినందించారు.