రిఫ్రిజిరేటర్ రిపేరింగ్ షాపులో అగ్ని ప్రమాదం
రిఫ్రిజిరేటర్ రిపేరింగ్ షాపులో అగ్ని ప్రమాదం
హన్మకొండ, తెలంగాణ జ్యోతి : జిల్లాలోని నయీంనగర్‌లో ని ఓ రిఫ్రిజిరేటర్ రిపేరింగ్ షాపులో అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. షాపులో షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు ఎగసిపడ్డాయి. వెంటనే షాప్ యజమాని గమనించి అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పారు. షాపులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. డాడీ