మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండలం సుందరయ్య కాలనీకి చెందిన బిఆర్ఎస్ నాయకుడు లక్కి శెట్టి ఏసు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన దశదినకర్మ సందర్భంగా వాజేడు మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పెనుమళ్ళ రామకృష్ణారెడ్డి  శనివారం ఏసు కుటుంబాన్ని పరామర్శించి బిఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా కుటుంబానికి అండదండగా ఉంటుందని ఓదార్చారు. రూ.8వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఏసు కుటుంబాన్ని పరామర్శించిన వారిలో పార్టీ నాయకులు పాయం జానకి రమణ, నాంపల్లి లక్ష్మీనారాయణ, ముత్తేబోయిన గిరిబాబు, మొడం నాగరాజు, పొడపాటి ముత్తయ్య, దనిశెట్టి కేదారేశ్వర్, ముత్తేబోయిన శ్రీను, మరియు స్థానిక బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు.