మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం శివారు బీ.సీ మర్రి గూడెం గ్రామానికి చెందిన గగ్గురి శ్రీను ఇటివల అనారోగ్యం తో మృతి చెందాడు. గ్రామానికి చెందిన యువత వారి పేద కుటుంబం పరిస్థితి, ఆర్ధిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పెద్దకర్మ నిమిత్తం స్వర్గీయ గగ్గూరి శ్రీను కుటుంబానికి నిత్యవసర సరుకుల తో పాటు ఆర్థిక ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్ర మం లో గంగయ్య , పానేం వెంకట్ ,బొల్లె శీను, కొప్పుల వినోద్ ,బట్టి నరేష్ ,వాదం జోగారావు ,యాట్ల వెంకటేష్, గగ్గూరి సతీష్ ,బొల్లె సందీప్, అంగాల ప్రవీణ్, రోడ్డ నరసింహారావు, బొల్లె రామకృష్ణ, కొప్పుల కిరణ్ బొల్లే ఆదినారాయణ తది తరులు పాల్గొని కుటుంబాన్ని ఓదార్చి అండదండగా ఉంటా మని ధైర్యం చెప్పి ఓదార్చారు .