ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ కుటుంబానికి ఆర్థిక సహాయం
వెంకటాపురంనూగూరు, జూన్ 11, తెలంగాణ జ్యోతి : వెంకటాపురం మండలం బెస్తగూడెం గ్రామానికి చెందిన ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ బేగ విజయ్ కుమార్ ఇటీవల మృతిచెందారు. ఈ నేపథ్యంలో ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ కార్మికుల సంఘం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సంతాపం తెలిపారు. బుధవారం సంఘం సభ్యులుమృతుడి కుటుంబాన్ని పరామర్శించి రూ.17 వేల ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. బీమా సదుపాయాన్ని త్వరితగతిన మంజూరు చేయించేందుకు చొరవ తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు సున్నం రమేష్, జూబ రమేష్, శెట్టిపల్లి వెంకటేశ్వర్లు, లతోపాటు సంఘం సభ్యులు పాల్గొన్నారు.