గిరిజన విద్య తల్లి సాత్వికకు ఆర్థిక సహాయం
-దాతలకు రుణపడి ఉంటాం : అబ్బు సతీష్
తెలంగాణజ్యోతి ,కన్నాయిగూడెం: ఏటూరునాగారం మం డలం బూటారం గ్రామానికి చెందిన కొడుమల సాత్విక ఆకు లవారి ఘనపురంలోని ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 10వ తర గతి వరకు చదివి భద్రాచలంలో ఇంటర్ పూర్తి చేసింది. ఇటీ వల నీట్ కౌన్సెలింగ్‌లో హైదరాబాద్‌లోని డాక్టర్ పట్నం మహేందర్‌రెడ్డి మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్లో సీటు పొందింది. నిరుపేద కుటుంబానికి చెందిన ఆదివాసీ తల్లి ఆర్థిక ఇబ్బందులతో తన కల సాకారం కాదేమోనని దాతలను ఆదుకోవాలని వేడుకుంది. దాతల సహకారంతో ముప్పనపల్లి సహాయనిది బృందం నేడు బూటారం వెళ్లి సాత్వికకి 11 వేల రూపాయలు అందించారు. ఈ కార్యక్రమంలో సహాయ నిధి సభ్యుడు విజయ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.