అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కేరళ వరద బాధితులకు ఆర్థిక సహాయం

Written by telangana jyothi

Published on:

అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కేరళ వరద బాధితులకు ఆర్థిక సహాయం

– రూ. 50 వేల చెక్కును మంత్రి సీతక్కకు అందజేత

వెంకటాపురంనూగూరు,తెలంగాణజ్యోతి:కేరళ వయానారు వరద బాధితుల సహాయార్థం ములుగు జిల్లా వెంకటా పురం ప్రాంతం నుండి గత ఐదు సంవత్సరాలుగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న అమ్మ ఫౌండేషన్ తమ వంతు సహాయంగా 50 వేల రూ. ప్రకటించారు. సంబంధిత చెక్కును శుక్రవారం అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పీర్ల కృష్ణ బాబు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మరియు, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ద్వారా కేరళ రాష్ట్రంలోని వయనారు వరద బాధితులకు సహాయార్థంగా అందజేశారు. అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పీర్ల కృష్ణ బాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ కష్టాల్లో ఉన్నవారికి, సహాయం చేయడంలో ఉన్న సంతృప్తి మరెందులో దొరకదని అన్నారు. ఈ సందర్భంగా ఆర్థిక సహా యం అందజేసిన అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు క్రిష్ణ బాబును మంత్రి సీతక్క తో సహా పలువురు అభినందిం చారు. వయానాడు బాధితులకి సహాయం చేసిన అమ్మ ఫౌండేషన్ అధ్యక్షులు పీర్ల కృష్ణ బాబు గత ఐదు సంవత్సరా లుగా పేద ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తూ వారి యొక్క మన్ననలు పొందుతున్న సంస్థ ను వారు అభినందించారు. ప్రత్యేకంగా కరోనా సమయంలో పేద ప్రజలకు అనేక సేవలందించిన తీరు మరువలేనిది అని ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్ ప్రతినిధులు, పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment