సినీ నటుడు హీరో విజయ్ దేవరకొండను వెంటనే అరెస్టు చేయాలి

సినీ నటుడు హీరో విజయ్ దేవరకొండను వెంటనే అరెస్టు చేయాలి

సినీ నటుడు హీరో విజయ్ దేవరకొండను వెంటనే అరెస్టు చేయాలి

-తెలంగాణ గిరిజన శక్తి ములుగు జిల్లా అధ్యక్షులు మూడ్ విరేష్ నాయక్

వెంకటాపూర్, తెలంగాణ జ్యోతి: సినీ నటుడు హీరో విజయ్ దేవరకొండ ను వెంటనే అరెస్టు చేయాలి తెలంగాణ గిరిజన శక్తి ములుగు జిల్లా అధ్యక్షులు మూడ్ విరేష్ నాయక్ అన్నారు. ఈ సందర్భంగా సోమవారం వెంకటాపూర్ మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ హీరో సూర్య నటించిన రెట్రో సినిమా ఆడియో విడుదల కార్యక్రమానికి హాజరైన సినీ నటుడు విజయ్ దేవరకొండ గిరిజనుల గురించి మాట్లాడుతూ 500 సంవత్సరా ల క్రితం వారు బుద్ధి లేకుండా, మినిమమ్ కామన్ సెన్స్ లేకుండా కొట్టుకున్నారు అని వ్యాఖ్యానించారు. మా జాతి బిడ్డలను పాకిస్తాన్ ఉగ్రవాదులతో పోల్చి, గిరిజనుల మనోభావాలను కించపరిచే విధంగా వ్యాఖ్యానించడం పట్ల తెలంగాణ గిరిజన శక్తి తీవ్రంగా ఖండిస్తుంది అని అన్నారు.. వెంటనే సినీ నటుడు విజయ్ దేవరకొండపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలి డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment