అకాల వర్షానికి పంట దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలి

అకాల వర్షానికి పంట దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలి

– ఎకరానికి రూ.20వేల పెట్టుబడి అందించాలి

– గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గోవింద నాయక్

ములుగు ప్రతినిధి: ములుగు జిల్లాలో అకాలవర్షానికి పంట లు నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చెందుతున్నా రని, దెబ్బతిన్న పంటలకు రూ.20వేల చొప్పున పరిహారం అందించాలని జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ కోరిక గోవిందనాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళవారం ములుగు మండలం దేవగిరిపట్నం, అన్నంపల్లి, మదనపల్లి గ్రామాలలో పర్యటించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకు న్నారు. ఈ సందర్భంగా గోవిందనాయక్ మాట్లాడుతూ ఇటీ వల కురిసిన వర్షాలకు పూర్తిగా వరి, మిరప పత్తి పంటలు దెబ్బతిన్నాయని, రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నార న్నారు. తక్షణమే రైతులకు పెట్టుబడి కింద ఎకరానికి రూ. 20వేల పెట్టుబడి అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. దెబ్బ తిన్న పంటలకు పరిహారంపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని అన్నారు. అదేవిధంగా రైతులకు రైతు భరోసా ఇస్తానని మాయ మాటలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం హరి ఖాతాలో నిధులు జమ చేయాలని డిమాండ్ చేశారు. లేని యెడల రైతుల పక్షాన ఆందోళన కార్యక్రమాలు చేపడతామ ని అన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు రైతులు ఉన్నారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment