సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన రైతులు
సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన రైతులు
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలంలోని ఆలుబాకా రైతు వేదికలో బోధపురం ఆలుబాక రైతుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేస్తున్న నాయ కుడు రేవంత్ రెడ్డి అని, రైతులకు సకాలంలో రుణమాఫీ చేసి ,రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూస్తున్న నిజమైన నాయకుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రైతు సోదరులు జీమిడి లక్ష్మణరావు, సుంకర నాగబాబు నాయుడు, కంతి. చందర్రావు, పోతురాజు,ప్రశాంత్, రౌతు. రాజీ బాబు,పోడెం సత్యనారాయణ, నవజీవన్,పోలిన నవీన్ కుమార్, తాటి రాంబాబు,మజ్జ. వెంకటేష్. జాడి కృష్ణ,ఏసుబాఋ,ఆలుబాక, బోదాపురం గ్రామ రైతు సోదరులు తదితరులు పాల్గొన్నారు.