రైతులు అధైర్య పడొద్దు : మంత్రి శ్రీధర్ బాబు

రైతులు అధైర్య పడొద్దు : మంత్రి శ్రీధర్ బాబు

రైతులు అధైర్య పడొద్దు : మంత్రి శ్రీధర్ బాబు

కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అర్హత ఉన్న రైతు లందరికీ రుణ మాఫీ అవుతుందని రాష్ట్ర ఐటీ, ఈ సీ, ఐ సి, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు తెలిపారు.జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం లో పర్యటించిన అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు. కొంత మంది ప్రతి పక్ష నాయకులు సాంకేతిక పరంగా బ్యాంక్ లలో ఏర్పడిన సమస్యలను అనువుగా చేసుకొని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఒక వైపు పకృతి వైపరీత్యం తో ఏర్పడిన అధిక వర్షాలతో వరదలు వచ్చి రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ప్రాంతాలలో పెద్ద ఎత్తున నష్ట జరిగిందని పేర్కొన్నారు. స్వయానా ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంఎల్ఏ లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలకు చేరువలో ఉంటూ సహాయక చర్యలు చేపట్టి వారిని ఆదుకునే కార్యక్రమం చేస్తున్నారని వివరించారు. ఎప్పుడు లేని విధంగా వరద సహాయ చర్య లకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కాకుండా అధికార యంత్రాంగం అప్రమత్తమై ప్రభుత్వ సూచ నల మేరకు యంత్రాంగం ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగిన కుటుంబాలకి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. అప్పటి ప్రభుత్వ హయం లో, గత పది సంవత్సరాలలో వరదలు వచ్చిన పంటనష్టం జరిగినా, ఇండ్లు కూలీ పోయినా ఒక్కసారి కూడా నష్ట పరిహారం అందించలేదని విమర్శించారు. తమ ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైనా పంట నష్ట వచ్చిన జిల్లా యంత్రంగంతో పూర్తి స్థాయిలో సర్వే చేపించి, పంట నష్ట పరిహారం చెల్లిస్తామని పేర్కొన్నారు. రాబోయే కాలంలో ప్రతి రైతు కి అండగా ఉంటామని తెలిపారు. అదే విధంగా ఇలాంటి విపత్తు సమయం లో సహాయక చర్యల్లో పాల్గొనక పోవడమే కాకుండా, రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సంతకాని సమ్మ య్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమునూరి ప్రభాకర్ రెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చీమల సందీప్, తేప్పల ప్రభాకర్, తెప్పల దేవేందర్, కడారి విక్రమ్, కుంభం రమేష్ , ఓం సింగ్ , జాడి రమేష్, చిట్టూరి మహేష్ మండల కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.