విద్యుత్ షాక్ తో రైతు మృతి
తెలంగాణ జ్యోతి, కాటారం: తను సాగు చేస్తున్న పొలానికి నీరు అందించే క్రమంలో విద్యుత్ పనులు చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి రైతు మృతి చెందిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దామరకుంట గ్రామపంచాయతీలోని లక్ష్మిపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. శనివారం ఉదయం వ్యవసాయ పనుల కోసం వెళ్లిన సంతోషం బాపు (65) అనే రైతు ట్రాన్స్ఫార్మర్ నుండి మోటర్ కు విద్యుత్ తీగలు సాపుతున్న క్రమంలో విద్యుత్ షాక్ తగిలి బాబు అక్కడికక్కడే మృతి చెందారు. వ్యవసాయ పని కోసం వెళ్లిన ఇతర రైతులు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కాటారం పోలీసులు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మహాదేవపూర్ సామాజిక ఆస్పత్రికి తరలించారు. మృతుడు బాపు ఇద్దరు కొడుకులు (మూగ వారు ) కాగా కొద్ది రోజుల క్రితం ఒక కుమారుడు మృతి చెందారు.