దేవగిరిపట్నం మైనారిటీ పాఠశాలలో వీడుకోలు సమావేశం
ములుగు, తెలంగాణ జ్యోతి : మండలంలోని దేవగిరిపట్నం మైనారిటీ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థుల వీడుకోలు సమావేశం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తొమ్మిదవ తరగతి విద్యార్థులు పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయగా, విద్యార్థుల సాంస్కృ తిక కార్యక్రమాలు అలరించాయి. పదవ తరగతి విద్యార్థులు వారి గత అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ఉపాధ్యాయులు వారికి మోటివేషన్ స్పీచ్ లతో పిల్లలకు వారి అనుభవాలను తెలియజేశారు. ఈ కార్యక్రమం లో ప్రిన్సిపాల్ శైలజ మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులు బాగా చదువుకొని ఈసారి కూడా ఉత్తమమైన ఫలితాలు తేవాలన్నారు. టి ఎన్ ఆర్ ఎస్ ములుగు గర్ల్స్ మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్ర మంలో ఉపాధ్యాయులు విద్యార్థులు, నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు.