ఆదర్శలో అలరించిన ఫేర్వెల్ డే వేడుకలు
– పాదపూజతో భావోద్వేగానికి గురైన తల్లిదండ్రులు.
తెలంగాణ జ్యోతి, కాటారం: మీ ప్రేమ కోరే చిన్నారులం … మీ ఒడిన ఆడే చందమామలం… గోరుముద్దలెరుగని బాల కృష్ణులం… బాధ పైకి చెప్పుకోని బాల ఏసులాం… ఆలో చించండి ఓ అమ్మా..నాన్న ఏం చెప్పగలం మీకు ఇంతకన్నా.. అంటూ తల్లిదండ్రుల విలువ, బాధ్యతలను గుర్తు చేస్తూ పిల్లలు ఆడి పాడారు. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర అంటూ చదువు నేర్పించిన గురువుల రుణం తీర్చుకోలేమంటూ.. మాతృదేవోభవ.. పితృదేవోభవ.. అంటు తల్లిదండ్రుల గొప్పతనంను వివరించిన తీరు ఆహుతులను కన్నీరు పెట్టించింది. మండల కేంద్రంలోని ఆదర్శ విద్యా సంస్థలో బుధవారం రాత్రి నిర్వహించిన ఫేర్వెల్ డే వేడుకలు అలరించాయి. విద్యార్థుల సంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టు కున్నాయి. అనంతరం పదవ తరగతి విద్యార్థులతో వారి తల్లిదండ్రులకు పాదపూజ కార్యక్రమం నిర్వహించారు.. తల్లిదండ్రుల గొప్పతనాన్ని తెలియజేసే విధంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలతో వారు భావోద్వేగానికి గురయ్యారు.ఈ సందర్భంగా ఆదర్శ విద్యాసంస్థల చైర్మన్ జనగామ కరుణాకర్ రావు మాట్లాడుతూ విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ ఎంతో మందిని దేశ , విదేశాల్లో ఉన్నత స్థానంలో నిలిచేలా కృషి చేస్తున్నమన్నారు. గత 34 సంవత్సరాలుగా సేవా దృక్పథంతో విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ విద్యాసంస్థల కరస్పాండెంట్ జనగామ కార్తీక్ రావు, ప్రిన్సిపాల్ కృషిత, యోగా గురూజీలు గౌరోజు సదానందం, శ్రీనివాస్, వేద పండితులు కృష్ణమోహన్ శర్మ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.