Seetakka | సీతక్క పై అసత్య ప్రచారాలు మానుకోవాలి

Seetakka | సీతక్క పై అసత్య ప్రచారాలు మానుకోవాలి

తెలంగాణ జ్యోతి,ఏటూరునాగారం ప్రతినిధి : డబ్బు సంచులతో టిఆర్ఎస్ పార్టీ లీడర్లను సీతక్క కొంటున్నారని టిఆర్ఎస్ పార్టీ నాయకులు అబద్ధపు ప్రచారాలు చేయడం మానుకోవాలని కాంగ్రెస్ ఏటూరునాగారం మండల అధ్యక్షుడు చిటమట రఘు అన్నారు. రెండు రోజుల క్రితం ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి,రెడ్ కో చైర్మన్ సతీష్ రెడ్డి ములుగు ఎమ్మెల్యే ఏఐసిసి మహిళ ప్రధాన కార్యదర్శి సీతక్క పై దుష్ప్రచారం చేస్తున్నారని, చత్తీస్గఢ్ నుండి డబ్బు సంచులు తీసుకొచ్చి బిఆర్ఎస్ నాయకులను కొంటున్నారని అబద్ధాలు ప్రచారం చేయడం సరికాదని, ఎవరు ఎవరిని కొంటున్నారో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కరోనా కష్టకాలంలో, ములుగు జిల్లాలో వరదల కారణంగా బాధితుల పక్షాన ఉండి అండగా నిలబడ్డారని,సీతక్క మరో మదర్ తెరిసా లాగా ప్రజాసేవకు అంకితమై రాజకీయాలు చేస్తున్నారు కానీ ఎవరిపై దుష్ప్రచారాలు చేయడం లేదని అన్నారు.ములుగు నియోజకవర్గంలో సీతక్కకు ఉన్న ప్రజా అభిమానాన్ని తట్టుకోలేక టిఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి అసత్య ప్రచారాలు ప్రజలు నమ్మకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి సీతక్కని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇరసవడ్ల వెంకన్న,మండల నాయకులు ఖలీల్ ఖాన్, ఎల్లయ్య,రంజిత్,కిషోర్ తదితరులు పాల్గొన్నారు