సౌకర్యాలు ఫుల్.. బోధకులు నిల్… 

సౌకర్యాలు ఫుల్.. బోధకులు నిల్… 

– వెంకటాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల దుస్థితి. 

– మంత్రి సీతక్కకు కాలేజీ సమస్యలతో స్వాగతం. 

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా మండల కేంద్రమైన నూగూరు వెంకటాపురంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ వెంకట్రావు ప్రత్యేక కృషితో ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంజూరు చేశారు. ఈ మేరకు నూతన జూనియర్ కళాశా లలో ఎంపీసీ, బైపీసీ, హెచ్ ఇ సి, సిఇసి నాలుగు గ్రూపులను మంజూరు చేశారు. ఈ మేరకు తెలుగు, ఇంగ్లీష్ మీడియం లో బోధన జరుగుతున్నది. నూతన కళాశాలలో అన్ని గ్రూపులకు కలిపి 86 మంది విద్యార్థులు కళాశాలలో ప్రవేశం పొందారు. కాగా మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హైస్కూల్ విద్యార్థుల సౌకర్యార్థం నిర్మించిన, నూతన పాఠశాల భవనంలో తాత్కా లికంగా రెండు గదులను ప్రభుత్వం జూనియర్ కళాశాలకు కేటాయించింది. ఆయా రెండు గదులను పూర్తిస్థాయి ఆధుని కరించి విద్యార్థుల బోధనకు అనుకూలంగా ప్రత్యేక నిధులు మంజూరు చేసి జిల్లా కలెక్టర్ పూర్తి చేయించారు. అయితే నూతన జూనియర్ కళాశాలకు విద్యార్థులు కూర్చునేందుకు 55 బెంచీలు, ఫర్నిచర్ ఇతర సామాగ్రిని జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధతో మంజూరు చేయించారు. అంతేకాక కొంతమంది దాత లు ముందుకు వచ్చి కొంత ఫర్నిచర్ ను, మౌలిక సదుపా యాలు కల్పనకు పూర్వ విద్యార్థుల సైతం, రాజకీయ పార్టీలు ముందుకు వచ్చాయి. ఇవన్నీ ఒకటి కాక జూనియర్ కళాశా లలో నాలుగు సబ్జెక్టులు బోధించేందుకు ముఖ్యమైన లెక్చరర్ పోస్టులు నేటికి భర్తీ చేయలేదు. దీంతో వాజేడు ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి ప్రతిరోజు ఇద్దరు లెక్చరర్లు వెంక టాపురం కళాశాలకు వచ్చి తరగతులు నిర్వహిస్తున్నారు. ఒక్కొక్క గ్రూపుకు 40 నిమిషాల చొప్పున ఇరువురు లెక్చరర్లు బోధన నిర్వహిస్తున్నారు. అంతేగాక కొంతమంది విద్యావం తులు వాలంటీర్లుగా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నలుగురు వాలంటీర్లు స్వచ్ఛందంగా విద్యా ర్థులకు బోధన నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో ప్రభుత్వం అతిధి లెక్చరర్ ల పోస్టులు భర్తీ చేసేందుకు జీవో లు జారీ చేయగా, అందులో వెంకటాపురం ప్రభుత్వ జూని యర్ కళాశాలకు అతిధి లెక్చరర్ పోస్టులు భర్తీ కి మంజూరు చేయలేదు. పోస్టులు భర్తీ జీవోలో ములుగు జిల్లా వెంకటా పురం జూనియర్ కళాశాల పేరు లేకపోవడం విశేషం. ప్రస్తుత జూనియర్ కళాశాల విద్యార్థుల సంఖ్య కనుగుణంగా 12 మంది లెక్చరర్లు అవసరం ఉండగా, బోధకులు పోస్టులు మాత్రం భర్తీ చేయలేదు. దీంతో ఇరువురు లెక్చరర్లు గ్రూపుకు 40 నిమిషాలు చొప్పున అష్ట కష్టాలు పడి బోధన నిర్వహిస్తు న్నారు. అయితే ప్రభుత్వం జూనియర్ కళాశాలకు సౌకర్యా లు సమర్థవంతంగా కల్పించి, కీలకమైన అతిధి భోథకుల పోస్టులు భర్తీ చేయకపోవడం పట్ల విద్యార్థులు తల్లిదండ్రులు, గ్రామస్తులు విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు,పూర్వ విద్యార్ధులు , ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని ములుగు జిల్లా మంత్రి సీతక్క భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్ల వెంకటరావు జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాలని విద్యార్థి సంఘాలు విద్యార్థి తల్లిదండ్రులు రాజకీయ పార్టీలు ప్రజాప్రతితులు విజ్ఞప్తి చేస్తున్నారు. మంత్రి సీతక్క గత జులై నెల 22వ తేదీన వెంకటాపురం జూనియర్ కళాశాలను ప్రారంభోత్సవంజరిపారు. కళాశాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. అయితే జూని యర్ కళాశాల నూతన భవనాల నిర్మాణం కోసం కస్తూరిబా గాంధీ పాఠశాల సమీపంలోని హెలిపాడ్ స్థలాన్ని ములుగు జిల్లా కలెక్టర్ ఎంపిక చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అలాగే నూతన భవనాల నిర్మాణం కోసం ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మంత్రి చేతుల మీదుగా నూతన గదులు ప్రారంభం

మండల కేంద్రం వెంకటాపురంలోని జూనియర్ కళాశాల నూ తన గదులు ప్రారంభోత్సవానికి మంగళవారం 16 వ తేది న పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్ల వెంకటరావు, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్, ములుగు జిల్లా ఇంటర్ విధ్యాదికారి డి చంద్రకళ తది తరులు వెంకటాపురం రానున్నట్లు ములుగు జిల్లా యంత్రాం గం ప్రకటించింది. ఈ మేరకు కళాశాల నూతన గదులు ప్రారంభోత్సవానికి, మంత్రి సీతక్క పర్యటనను విజయవంతం చేయడానికి కళాశాల యాజమాన్యం,కాంగ్రెస్ పార్టీ నాయకు లు, విద్యార్థి సంఘాలు స్వాగత సన్నాహాలను ముమ్మరంగా చేపట్టారు. మంగళవారం సాయంత్రం మూడు గంటల ప్రాంతంలో జూనియర్ కళాశాల గదుల ప్రారంభోత్సవానికి మంత్రి సీతక్క పర్యటించనున్నట్లు మినిస్టర్ షెడ్యూల్లో ప్రకటించారు.