విస్తృతంగా వాహనాల తనిఖీలు.
విస్తృతంగా వాహనాల తనిఖీలు.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్ సర్కిల్ పరిధిలోని వాజేడు మండలం గణపురం ప్రధాన రహదారిపై బుధవారం ఉదయం పోలీసులు విస్తృతంగా వాహనాలు తనిఖీల కార్యక్రమాన్ని నిర్వహించారు. వచ్చే పోయే వాహనాలను తనిఖీ లు నిర్వహించి, అపరిచిత వ్యక్తుల సమాచారాన్ని ఈ సందర్భంగా రాబట్టారు. ప్రతి వాహనదారుడు ధ్రువపత్రాలు కలిగి ఉండాలని , మద్యం సేవించి వాహనాలు నడపరాదని ఈ సందర్భంగా ఇంధన శకట దారులకు అవగాహన కల్ఫీంచారు. ఈ కార్యక్రమం లో వాజేడు ఎస్.ఐ.వెంకటేశ్వరరావు , సివిల్ పోలీస్ తో పాటు, సిఆర్పిఎఫ్ సిబ్బంది తదితరులు తనిఖీ ల కార్యక్రమంలో పాల్గోన్నారు.