అటవీ గ్రామాలలో విస్తృతంగా పోలీసుల తనిఖీలు

అటవీ గ్రామాలలో విస్తృతంగా పోలీసుల తనిఖీలు

అటవీ గ్రామాలలో విస్తృతంగా పోలీసుల తనిఖీలు

ఏటూరునాగారం ఎస్సై తాజుద్దీన్

తెలంగాణజ్యోతి, ఏటూరునాగారం: మారుమూల ఏజెన్సీ గ్రామీణ అటవీ ప్రాంతాలలో శనివారం ఎస్సై తాజుద్దీన్ ఆధ్వర్యంలో సివిల్ సిఆర్పిఎఫ్ పోలీసులు, ప్రత్యేక బలగాలు మోహరించి విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 2 నుండి 8 వరకు మావోయిస్టుల వారోత్సవాలను తిప్పికొట్టేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా అప్రమతమైన పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పుడు అడవి గ్రామాలు గుత్తి కోయ గూడాలపై నిఘా ను మరింత పటిష్టం చేశారు. వాహన తనిఖీల్లో కొత్త వ్యక్తులు కనిపిస్తే వారి యొక్క వివరాలు సేకరించి గుర్తింపు కార్డులు పరిశీలించి, అనుమానాస్పద వ్యక్తులను విచారించి, వాహన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ తనిఖీ చేస్తున్నారు. త్రిబుల్ రైడింగ్ ప్రమాదకరంగా అతి వేగంగా వాహనాలు నడపరాదని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లం ఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో కొత్త వ్యక్తులకు ఆశ్రయం కల్పించవద్దని చట్ట వ్యతి రేక కార్యక్రమాలకు పాల్పడితే ఊరుకునేది లేదని చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సివిల్, సి ఆర్ పి ఎఫ్ పోలీసులు పాల్గొన్నారు