సరిహద్దు గ్రామాలలో పోలీసుల విస్తృత తనిఖీలు

సరిహద్దు గ్రామాలలో పోలీసుల విస్తృత తనిఖీలు

సరిహద్దు గ్రామాలలో పోలీసుల విస్తృత తనిఖీలు

ఏటూరు నాగారం ఎస్సై తాజుద్దీన్

    తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం : ఏటూరునాగారం సరిహద్దు గ్రామీణ అటవీ ప్రాంతాలలో ఏటూరు నాగారం ఎస్సై తాజుద్దీన్ ఆధ్వర్యంలో ఆదివారం సివిల్. సిఆర్పిఎఫ్. ప్రత్యేక బలగాలతో పోలీసుల విస్తృత తనిఖీలు. నిర్వహిస్తు న్నారు. మావోయిస్టుల వారోత్సవాలు నేడు చివరి రోజు కావడం, చల్పాక అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ ను నిరసిస్తూ మావోయిస్టులు బందుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో మావో లు ప్రతీకార చర్యలకు పాల్పడే అవకాశం ఉండడంతో ముంద స్తు చర్యల్లో భాగంగా ములుగు జిల్లా ఎస్పీ శబరిష్ ఆదేశాల మేరకు ఏటూరు నాగారం సిఐ అనుముల శ్రీనివాస్ సూచన ల మేరకు పోలీస్ బలగాలు పెద్ద ఎత్తున మొహరించి తెలం గాణ చతిస్గడ్ సరిహద్దు ప్రాంతాలు రొయ్యూరు అటవీ గ్రామీణ ప్రాంతాలు, ముల్లకట్ట వంతెన జాతీయ ప్రధాన రహ దారిపై విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. సరిహద్దు పరిసర గ్రామాలు. గుత్తి కోయ గుడాలపై ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలను ముమ్మరం చేశారు. మండల కేంద్రంలో ఆర్టీసీ బస్టాండు . ప్రధాన రహదారిపై వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. వాహన ధ్రువీకరణ పత్రాలు. వారి గుర్తింపు కార్డులను. పరిశీలిస్తూ వివరాలు అడిగి తెలుసుకుంటూ. అనుమానితులను అదు పులోకి తీసుకొని విచారించి వదిలేస్తున్నారు. ఈ కార్యక్ర మంలో సివిల్ .సిఆర్పి ఎఫ్ ప్రత్యేక బలగాలు పాల్గొన్నారు

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment