అంతా నా ఇష్టం – ఆర్ఎంపీ ఇష్టారాజ్యం..!
– మందులు కోసం పడిగాపులు
తెలంగాణజ్యోతి,కన్నాయిగూడెం : మండలంలోని లక్ష్మీపురం గ్రామంలోని ఓ మెడికల్ షాప్ యజమాని, ఆర్ఎంపీ పేషేంట్ల తో అంతా మా ఇష్టం అంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గురువారం నాడు ఓ వ్యక్తి ఫీవర్, మోషన్స్ అవుతున్నాయని మెడికల్ షాప్ వద్దకు వెళ్లగా పేషేంట్ ను గంటల తరపడి నిలబెట్టడంతో ఆలస్యం చేస్తున్నారని మందులు ఇవ్వండని అడుగుతే నా షాప్ నా ఇష్టం నేను గిట్లనే, అసలు టాబ్లెట్స్ ఇవ్వను,ఎందుకు ఇవ్వాలి ఎవరికి చెప్పతావో చెపుకో అని సమాధానం ఇచ్చారని సదరు వ్యక్తి మీడియాతో చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఎమర్జెన్సీ సమయంలో టాబ్లెట్లకు వెళితే అధిక ధరలు తీసుకుంటున్నా రని గ్రామస్థులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సదరు షాపు, ఆర్ఎంపి పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
– కన్నాయిగూడెం ఆసుపత్రి డాక్టర్ అభినవ్
మెడికల్ షాపు యజమానిపై కన్నాయిగూడెం ఆసుపత్రి డాక్టర్ అభినవ్ ను తెలంగాణ జ్యోతి ప్రతినిధి వివరణ కోరగా మాకు ఇప్పుడే మా దృష్టికి వచ్చింది వారిపై చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.