ప్రతి ఒక్కరూ దేశభక్తి భావాలు అలవర్చుకోవాలి
– ఆర్ ఎస్ ఎస్ వరంగల్ విభాగ్ ప్రముఖ్ కర్ణాకర్
– ములుగులో రూట్ మార్చ్
ములుగుప్రతినిధి: కులమత ప్రాంతాలు ఏవైనా ప్రతి ఒక్కరు భారత దేశం పట్ల ప్రేమ, భక్తిభావం అలవర్చుకోవాలని ఆర్ ఎస్ ఎస్ వరంగల్ విభాగ్ సంపర్క్ ప్రముఖ్ జూలపల్లి కర్ణాకర్ పిలుపునిచ్చారు. గురువారం ములుగులోని సెయింట్ ఆంథో నిస్ ఉన్నత పాఠశాలలో ఖండ కార్యవాహ భాష బోయిన మహేందర్ ఆధ్వర్యంలో జరిగిన విజయ దశమి ఉత్సవ కార్యక్రమంలో కర్ణాకర్ ముఖ్య వక్తగా హాజరై మాట్లాడారు. కన్నతల్లిపై చూపించే ప్రేమ వలె పుట్టిన గడ్డపై కూడా అదే స్థాయిలో భావన కలిగి ఉండాలని, స్వదేశీ భావన, మాతృ భాష, కుటుంబం, పర్యావరణ పరిరక్షణ తదితర మంచి అలవాట్లను పెంచుకోవాలని యువతకు సూచించారు. ప్రపం చ స్థాయిలో భారతదేశం దిక్సూచిగా ఉండనుందని, ఈ దేశం లో ఉంటూ పొరుగు దేశాలపై ప్రేమ చూపించే వారి పట్ల జా గ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. దేశాన్ని కాపాడు కోవడంలో ఇజ్రాయిల్ పౌరులను చూసి నేర్చుకోవాలన్నారు. భారత్ విశ్వ గురువుగా వెలుగొందుతుందని స్పష్టం చేశారు. అనంతరం ములుగులోని కాలనీలలో ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు పథసంచలనం నిర్వహించారు. మహిళలు చిన్నా రులు పూలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ప్రియ నేస్తం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పింగళి నాగరాజు, 156 మంది స్వయం సేవకులు పాల్గొన్నారు.