ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి
ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి
- జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
- ఓటర్ అవగాహన ర్యాలీ నీ ప్రారంబించిన జిల్లా కలెక్టర్
తెలంగాణ జ్యోతి, భూపాలపల్లి ప్రతినిధి: భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. శనివారం భూపాలపల్లి మున్సిపల్ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు అంగన్వాడి టీచర్లు, మెప్మా, మున్సిపల్ సిబ్బందితో ఓటు హక్కు వినియోగంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా ముఖ్యఅతిథిగా హాజరై ఓటర్ ప్రతిజ్ఞ చేపించి, జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ. భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్క పౌరుడు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఇతర దేశాలతో పోల్చితే భారతదేశం లో ఓటు హక్కు కు అత్యధిక ప్రాధాన్యత ఉన్నదని అన్ని వర్గాల ప్రజలకు సమానమైనది ఓటు హక్కు అని ప్రపంచంలో 200 దేశాలు ఉంటే అందులో కొన్ని దేశాలలో మహిళలకు ఓటు హక్కు కల్పించలేదు. కానీ భారత దేశం లో1947 నుండి మొదట 21 సంవత్సారాలు కలిగిన తదుపరి 18 సం. నిండిన ప్రతీ ఒక్కరికీ ఆడ, మగ, తర్డ్ జెండర్, చదువు కున్నవరు, చదువు లేని వారు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఓటు హక్కును కల్పించిన ఒకే ఒక్క దేశం భారత దేశం అని అన్నారు. ప్రస్తుతం 18 సంవత్సారాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవవచ్చునని తెలంగాణ రాష్ట్రం లో రాబోయే 8నెలల్లో 4సార్లు ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం వస్తుందనీ ఓటు వేయడాన్ని ఓక బాధ్యత గా, గర్వంగా ఫీలు అవ్వాలనీ ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనీ అన్నారు. పోలింగ్ కేంద్రాలు మీ ఇంటికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంటాయనీ వికలాంగులు, వృద్దులు ఓటు వేసేందుకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందనీ గత ఎన్నికలలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా 82 శాతం పోలింగ్ నమోదయిందనీ, నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఈ రోజు ఓటర్ అవగాహన ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు.ఈ కార్యక్రమంలో జెడ్పీ సి.ఈ. ఓ. విజయ లక్ష్మి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి నాగేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ అనిల్ కుమార్, అంగన్వాడి టీచర్లు, అయాలు, తదితరులు పాల్గొన్నారు.