ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి

ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి

ఏఎస్పీ మహేష్‌ గీతె

తెలంగాణజ్యోతి ప్రతినిధి, ఎటూరునాగారం : ప్రతి ఓటరు నిర్భయంగా రాబోయే పార్లమెంట్‌ పోలింగ్‌లో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకోవాలని ఏటూరునాగారం ఏఎస్పీ మహేష్‌ గీతె బాబా సాహెబ్‌ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో క్రాస్‌ రోడ్డు నుంచి చివరి వాడ వరకు సీఆర్‌పీఎఫ్, సివిల్‌ పోలీసు సిబ్బందితో ప్లాగ్‌ మార్చ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. దళిత వాడ, గల్లిలలో సైతం ర్యాలీని కొనసాగించారు. మే 13న పార్లమెంట్‌ ఎన్నికలు ఉన్నాయ న్నారు. ఎవరు కూడా బయపడకుండా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఎలాంటి ప్రలోభాలకు లోనొవద్దని హితవు పలికారు. ప్రభుత్వం, పోలీసులు ఓటరుకు అండగా ఉంటుందన్నారు. పోలింగ్‌ స్టేషన్‌లకు కావాల్సిన సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. శాంతిభద్రతలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరా రు. ఎన్నికల కోడ్‌ను పాటించాలని కోరారు. కార్యక్రమంలో సీఐ మండల రాజు, ఎస్సై గుర్రం కష్ణప్రసాద్, కన్నాయగూడెం ఎస్సై సురేష్, సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది, సివిల్‌ కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.