ఫైర్ సేఫ్టీ నిబంధనలను విధిగా ప్రతి ఒక్కరు పాటించాలి

ఫైర్ సేఫ్టీ నిబంధనలను విధిగా ప్రతి ఒక్కరు పాటించాలి

ఫైర్ సేఫ్టీ నిబంధనలను విధిగా ప్రతి ఒక్కరు పాటించాలి

– 101 కు వేగంగా సమాచారం ఇస్తే నివారణ చర్యలు చేపడతాం

– ములుగు జిల్లా ఫైర్ ఆఫీసర్ కుమారస్వామి

– అగ్ని ప్రమాదాల వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

ములుగు, తెలంగాణ జ్యోతి : ప్రతి ఒక్కరూ ఫైర్ సేఫ్టీ నిబంధనలను పాటించాలని, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వేగంగా తమకు సమాచారం అందిస్తే వెంటనే ప్రమాద నియంత్రణ చర్యలను చేపడతామని ములుగు జిల్లా ఫైర్ ఆఫీసర్ కె.కుమారస్వామి అన్నారు. అగ్ని ప్రమాద వారోత్సవాల్లో భాగంగా ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు జిల్లాలో చేపట్టనున్న అవగాహన కార్యక్రమాలపై ఆదివారం ములుగులో మీడియా సమావేశం నిర్వహించారు. వారోత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఫైర్ ఆఫీసర్ కుమారస్వామి మాట్లాడుతూ అగ్ని ప్రమాదాల నివారణ పట్ల అవగాహన పెంచుకావాలని, వేసవికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తూచా తప్పకుండా పాటించాలన్నారు. 1944 ఏప్రిల్ 14న ముంబాయి విక్టోరియా డాక్యార్డ్తో ఒక నౌకకు అగ్ని ప్రమాదం సంభవించి విధి నిర్వహణ లో అసువులు బాసిన 66మంది అగ్నిమాపక సిబ్బంది స్మార కార్థం దేశవ్యాప్తంగా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నా రు. కర్తవ్య నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నిమాపక సిబ్బందికి జోహార్లు అర్పించడం, అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్త చర్యల గురించి ప్రచారం చేస్తూ ప్రజలను చైతన్య వంతులనుచేయడం ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. అతిచిన్న నిప్పురవ్వను ఆర్పకుండా నిర్లక్ష్యం అతి ఘోరమైన ప్రమాదం కలిగిస్తుందన్నారు. ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు మనోస్తైర్యం కోల్పోకుండా అగ్నిమాపక కేంద్రానికి సమాచారము అందించాలని సూచించారు. ఈ నెల 14న అగ్నిమాపక పరేడ్ నిర్వహించి స్టాల్స్ ద్వారా అవగాహన కల్పిస్తామని, 15న ఆర్టిస్ట్ ఆర్టీసీ బస్టాండ్ ఇతర పబ్లిక్ ప్రాంతాలలో అగ్ని ప్రమాద నివారణ పై అవగాహన, 16న ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద, 17న ప్రగతి కాలనీ ఇతర ప్రాంతాల్లో, 18న హెచ్పీ గ్యాస్ వద్ద, 19న సినిమా థియేటర్లలో, 20న అగ్నిమాపక కేంద్రం జిల్లా కార్యాలయం వద్ద ముగింపు కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లీడింగ్ ఫైర్ మాన్ పి.మహేశ్వర్, సిబ్బంది కుమార్, ఎం. మహేందర్, సిహెచ్.ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment