ప్రతి ప్రైవేటు ఎలక్ట్రీషియన్ లేబర్ ఇన్సూరెన్స్ కార్డు పొందాలి
– పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలకు అనుగుణంగా రేట్లు పెంచాలి.
– ప్రైవేటు ఎలక్ట్రీషియన్ యూనియన్.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ప్రతి ప్రైవేటు ఎలక్ట్రీషియన్ లేబర్ ఇన్సూరెన్స్ కార్డు పొందా లని, కరెంటు పనులు చేసే సమయాల్లో ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు వహించాలని, ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ పథకా లు ప్రైవేటు ఎలక్ట్రిషన్ లకు మంజూరు చేయాలని, తెలం గాణ ప్రైవేట్ ఎలక్ట్రిషన్ యూనియన్ వెంకటాపురం, వాజేడు మండలాల సమావేశం తీర్మానించింది. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ అతిథి గృహం ఆవరణలో యూనియన్ నాయకులు సున్నం రమేష్ , పానెం శ్రీను సాధన పెళ్లి మోహన్ రావుల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలను చర్చించుకుని, ఎలక్ట్రీ షియన్లు ఎదు ర్కొంటున్న వివిధ సమస్యలను కూలంకషంగా చర్చించుకు న్నారు. ప్రైవేట్ ఎలక్ట్రిషన్లు ఐక్యత తో కలిసి మెలిసి ఉండా లని, పనుల్లో నాణ్యత ఉండాలని, పనులు చేసే సమయాల్లో జాగ్రత్తలు వహించి, భద్రతా పరమైన చర్యలు తీసుకోవాలని సమావేశంలో కోరారు. ప్రతినెల జరిగే యూనియన్ సమావే శాలకు ప్రతి ప్రైవేట్ ఎలక్ట్రిషన్ హాజరుకావాలని సమావేశం కోరింది. ఈ సమావేశంలో ప్రభుత్వం అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలు ప్రైవేటు ఎలక్ట్రీషియన్ లకు మంజూరు చేయాలని సమావేశం తీర్మానించింది. ఈ సమావేశంలో వెంక టాపురం, వాజేడు మండలాల ప్రైవేటు ఎలక్ట్రీషియన్లు, టెక్నీ షియన్లు హాజరయ్యారు.