యోగితానగర్ లో విద్యుత్ శాఖ రైతు పొలంబాట
– ప్రతి రైతు తమ మోటార్ వద్ద కెపాసిటర్ అమర్చుకోవాలి.
– వెంకటాపురం ఏడిఈ ఆకిటి స్వామి రెడ్డి.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : మండల పరిధిలోని యోగితానగర్ గ్రామంలో రైతులతో విద్యుత్ శాఖ ఏడిఈ ఆకిటి స్వామి రెడ్డి ఆధ్వర్యంలో రైతు పొలంబాట కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ రైతులు తమ విద్యుత్ మోటార్ ల వద్ద విధిగా కెపాసిటర్లు అమర్చుకోవాలని, తద్వారా అనేక విద్యుత్ ప్రయోజనాలు ఉంటాయని, ఫలితంగా ట్రాన్స్ఫార్మర్లపై భారం పడదని ములుగు జిల్లా వెంకటాపురం విద్యుత్ శాఖ ఏడిఈ ఆకిటి స్వామి రెడ్డి రైతులకు సూచించారు. రైతు సోదరులు ఉచిత విద్యుత్తు పొందే అంశం పై విద్యుత్ శాఖకు ఏ విధంగా సహకరించాలనే అంశంపై, సుదీర్ఘంగా రైతు సోదరులకు అవ గాహన కల్పించారు. కెపాసిటర్ లు వాడటం వల్ల విద్యుత్ మోటార్ల కాలిపోకుండా ఉంటాయని, ఇంకా అనేక ప్రయోజ నాలు ఉన్నాయని తెలియజేశారు. అలాగే రైతులు తమ మోటార్ల వద్ద విద్యుత్ ప్రమాదాలకు గురి కాకుండా ఉండేం దుకు తగు మెలుకువలు, జాగ్రత్తలను కూడా రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఏడీఈ ఆకిటి స్వామి రెడ్డి తో పాటు, విద్యుత్ శాఖ సిబ్బంది, రైతులు, రైతు పొలం బాట కార్యక్రమంలో పాల్గొన్నారు.